హైదరాబాద్ : GHMC ఎర్లీబర్డ్ ఆఫర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ముందుగానే పన్ను చెల్లిస్తే…. 5 శాతం రాయితీ కల్పిస్తాం అని చెప్పడంతో.. సిటీజన్లు క్యూ కడుతున్నారు. కానీ పన్ను చెల్లించడానికి వచ్చే వారికి మాత్రం కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరేళ్ళగా బల్ధియా ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద అధికమొత్తంలో పన్నులు వసూలు చేస్తోంది. 2018-19లో 400 కోట్లు వసూలు చేస్తే, 2017-18లో 368 కోట్ల 36 లక్షలు, 2016-17లో 213కోట్లు, 2015-16లో 161 కోట్ల 38లక్షలు , 2014-15లో 119 కోట్ల 94 లక్షలు, 2013-14లో 109 కోట్లు, 2012-13ల 30కోట్లు వసూలయ్యాయి. ఏడాది చివర్లో పన్నులను చెల్లించడం కన్నా.. ముందస్తుగానే చెల్లిస్తే.. 5 శాతం రాయితీని కల్పిస్తోంది. దీంతో ఆరు ఏళ్లుగా జీహెచ్ఎంసీలో ఎర్లీబర్డ్ ఆఫర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఎర్లీబర్డ్ ఆఫర్ ఏప్రిల్ 6 నుంచి .. 30వ తేదివరకే ఉంటుందన్నారు జీహెచ్ఎంసీ కమీషనర్ దానకిశోర్. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 1401 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూల్ చేసిన బల్ధియా అధికారులు ఫుల్ జోష్ లో వున్నారు. అదే జోష్ తో… ఎర్లీబర్డ్ కూడా వసూల్ చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు బల్ధియా బాస్ దానకిశోర్. ఏడాది ఎర్లీబర్డ్ ఆఫర్ ప్రారంభమైన… 3రోజులకే 8 కోట్ల వరకు వసూలు చేసింది బల్ధియా. నగర ప్రజలు ఎర్లీబర్డ్ ఆఫర్ కింద పన్నులు చెల్లించడానికి క్యూ కడ్తున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఈ ఎర్లీబర్డ్ సెంటర్లు పన్ను చెల్లింపు దారులతో కిక్కిరిసిపోతున్నాయి.
కానీ పన్ను చెల్లించడానికి వచ్చే వారికి మాత్రం కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సినియర్ సిటిజన్లు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే వున్న పన్ను చెల్లింపు కేంద్రంలో కనీస వసతులు లేక సిటీజన్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వృద్దులకు కనీసం కూర్చొడానికి కూర్చిలు కూడా లేకపోవడంతో.. గంటల తరబడి నిలబడి పన్నులుచెల్లిస్తున్నారు. ముందస్తు పన్నుల చెల్లింపు కోసం బల్ధియా తీసుకొచ్చిన ఎర్లీబర్డ్ ఆఫర్ బాగానే వున్నా.. మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు సిటిజన్లు.