- రూ. 1401.09 కోట్లు వసూలు
- టౌన్ ప్లానింగ్ ద్వారా రూ.854.24 కోట్లు
- ఏప్రిల్ 6 నుంచి ఎర్లీ బర్డ్ ట్యాక్స్ కలెక్షన్
- కమిషనర్ ఎం.దాన కిశోర్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ రికార్డు సృష్టించింది. 2018 -19 సంవత్సరానికి పన్ను వసూలులో ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా,నోటీసులు జారీ చేయకుండానే రూ. 1401.09 కోట్లు రాబట్టింది. ప్రకటనల ద్వారా ఆస్తుల యజమానుల కు చేసిన విజ్ఞప్తితోనే సత్ఫలితాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరాన్ని పోల్చి చూస్తే ఈసారి రూ. 74.29 కోట్లు అదనంగా వచ్చాయి. కమిషనర్ ఎం.దాన కిశోర్ నిరంతర సమీక్ష, బల్దియా అధికారులు, కింది స్థాయి సిబ్బంది కృషితోనే వసూలు లక్ష్యం చేరారు. ముఖ్యం గా కమిషనర్ నిరంతర పర్యవేక్షణ ,రోజూ జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లు, వారానికోసారి ఆస్తి పన్ను సేకరణ విధానంలో సవరణలు చేపట్టారు. ఫిబ్రవరి, మార్చిలో ప్రతి ఆదివారం చేపట్టిన ప్రాపర్టీ ట్యాక్స్ ప రిష్కారం తదితర అంశాలు కూడా ఇందుకు దోహదం చేశాయి. 2018 అక్టోబ ర్ 1 నుండి నిరంతరంగా ఆరు నెలల పాటు ఎన్నికల విధుల్లో జోనల్ కమిషనర్లు , డిప్యూటీ కమిషనర్లు తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నా గతేడాదికి మిం చి ఆస్తి పన్ను సేకరించడంపై కమిషనర్ సిబ్బందిని అభినందిం చారు. 2017-– 18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1326.80 కోట్లు సేక రించగా, 2018–-19 సంవత్సరంలో రూ. 1401.09కోట్లు వసూలు చేసింది. ఇందులో రెసిడెన్షియల్ ద్వారా రూ. 461.83 కోట్లు, రెసిడెన్షియల్ ద్వారా రూ. 778.70 కోట్లు, మిక్స్‌డ్ ప్రాపర్టీల ద్వారా రూ. 160.47 కోట్లు లభించాయి.
టౌన్ ప్లానింగ్ ది సింహభాగం
జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా అధిక ఆదాయం సాధించిం ది. భవన నిర్మాణ అనుమతుల ద్వారానే 2018-–19 సంవత్సరంలో రూ. 854.24 కోట్లు వచ్చాయి. 2017-– 18ఆర్థిక సంవ త్సరంలో టౌన్ ప్లానిం గ్ ద్వారా రూ.647.02 కోట్లు రాగా, 2018-–19 సంవత్సరంలో అదనంగా రూ. 207.22 కోట్లు వసూలయ్యాయి.
ట్రేడ్ లైసెన్స్, అడ్వర్‌టైజ్‌మెంట్లతోరూ. 73.20 కోట్లు
ట్రేడ్ లైసెన్స్, అడ్వర్టయిజ్ మెంట్‌ల ద్వారా సంతృప్తికర ఆదాయం లభించిం ది. 2018-–19లోరూ. 41.36 కోట్లు రాగా, అడ్వర్‌టైజ్ మెంట్ ఫీజు కిం ద రూ. 31.84 కోట్లు వసూలయ్యాయి. ఈ నెల 6 నుం చి ఎర్లీ బర్డ్ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే ఆస్తిపన్నును చెల్లించి 5 శాతం రిబేట్ పొందేందుకు వీలుగా ప్రవేశ పెట్టిన ఎర్లీ బర్డ్ స్కీ మ్ లో పెద్దమొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్ సేకరించాలని జీహెచ్ఎంసీ ప్లాన్ రూపొందించిం ది. ఏప్రిల్ 6 నుంచి 30 వరకు స్కీ మ్‌ను అమలు చేస్తారు.2019-–20 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ముందస్తు గా చెల్లించే వారికి 5 శాతం రిబేట్‌ను అందించనున్నట్టు కమిషనర్ ఎం.దాన కి శోర్ ప్రకటించారు. ఇప్పటికే 2018-–19 ఆర్థిక సంవత్సరానికి గాను ఎర్లీబర్డ్‌లో రూ. 437.75 కోట్లు సేకరించిం ది. ఈ సారి అంతకంటే ఎక్కువగా రాబట్టాలని ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఈ ఐదు శాతం రాయితీ కేవలం 2019 – 20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపుపై మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత సంవత్సరం ఆస్తి పన్నును జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ని అన్ని సిటిజన్ సర్వీస్ సెంటర్లు , మీ-సేవా, ఈసేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లో, ఎంపిక చేసిన బ్యాంకు బ్రాంచ్‌ల్లో , మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్ ద్వారా ఏప్రిల్ 7 నుంచి చెల్లించ వచ్చని సూచించారు.2018–-19 ఆర్థిక సంవత్సరం ముగింపు దృష్ట్యా జీహెచ్ఎంసీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నందున ఎర్లీబర్డ్‌లో ఆస్తి పన్ను చెల్లింపులను ఏప్రిల్ 6తర్వాత స్వీకరించనున్నట్లు కమిషనర్ తెలిపారు.