సిటీలో రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని బల్దియా నిర్ణయించింది. రహదారుల పునరుద్ధరణ, రిపేర్లు, గుంతలు లేకుండా చూడాల్సిన పూర్తి బాధ్యతలు ఏజెన్సీలకు ఇవ్వాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. జీహెచ్‌ఎంసీ ఏటా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నా చిన్నచిన్న వానలకే రోడ్లు తుక్కుతుక్కు అవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లమీద 5 వేల గుంతలు ఏర్పడ్డాయి. 987 రహదారులు రూపురేఖలు కోల్పోయాయి. వీటి రిపేర్లకు రూ.44 కోట్లు ఖర్చయ్యాయి. రూల్స్ ప్రకారం ఈ పనులన్నీ కాంట్రాక్టర్లు చేయాల్సినవే. కానీ, మెతక వైఖరితో అధికారులు బల్దియా నిధులు వెచ్చిస్తున్నారు. దీంతో సంస్థపై అదనపు భారం పడుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు ఐదేండ్ల నిర్వహణ బాధ్యతలు (డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్) కూడా ఏజెన్సీలకే ఇవ్వాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదంరావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపచ్చజెండా ఊపితే సిటీలో రోడ్ల నిర్మాణ, నిర్వ-హణ ప్రైవేటు ఏజెన్సీ లు నిర్వహిం చనున్నాయి.
ప్రైవేటు చేతికి రోడ్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 687.31 కిలోమీటర్ల ప్రధాన రహదారులు ఉన్నాయి. ఏటావీటి నిర్మాణ, నిర్వహణ కోసం జీహెచ్‌ఎంసీసుమారు రూ.500 కోట్లు వెచ్చి స్తోంది. రోడ్ల నిర్మాణానికి సంబంధించి పనులను కాం ట్రాక్టర్లకుఅప్పగిస్తోంది. రోడ్లు వేసిన తర్వాత ఆరు నెలలలోపు దెబ్బ తిం టే మరమ్మతులు చేపట్టాల్సినబాధ్యత రోడ్డు వేసిన కాంట్రాక్టర్ . కానీ రోడ్లువేసిన తర్వాత ఒక్క వానకే గుం తలమయంగామారుతున్నాయి. చిన్నపాటి వర్షా నికి కూడావేల సంఖ్యలో గుం తలు ఏర్పడు తున్నాయి. రోడ్లనిర్మా ణ, నిర్వహణ విషయంలో ఎన్ని ప్రణాళికలుఅమలు చేసినా ఫలితం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సరికొత్త ఆలోచన చేస్తోంది.సిటీలోని 687.31 కిలో మీటర్ల ప్రధాన రహదారుల్ని వార్షిక నిర్వహణ పద్ధతిలో ఏజెన్సీ లకు అందించేందు కు ప్రతిపాదనలు రూపొందిం చింది.ఇటీవల జరిగిన స్టాండిం గ్ కమిటీలో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రోడ్ల నిర్మాణ, నిర్వహణబాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనలపై తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపనుంది.నగరంలో 6 వేల కిలోమీటర్ల అంతర్గత రహదారులు ఉన్నాయి. వీటి నిర్మాణ, నిర్వహణ బాధ్యతజీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంటుంది. ఇందులో అధికంగా సీసీ రోడ్లు ఉన్నాయి.
ఎందుకీ ఆలోచన?
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యం లో రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. తూతూ మంత్రంగా రోడ్లు వేసినా పట్టించుకునే నాథులు లేకపోవడంతో ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రోడ్లు వేసిన రెండు మూడు నెలలకే దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.బల్దియా అధికారుల అలసత్వాన్ని కాంట్రాక్టర్లు ఆసరాగా చేసుకుని దోపిడీ కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్లపై జీహెచ్‌ఎంసీ మెతక వైఖరి అనుసరిస్తోంది. కాంట్రాక్టర్లను ఎందుకు ఎంటర్న్ చేస్తున్నారో అని అనుమానాలకు తావిస్తోంది.సిటీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రహదారుల పై 5 వేల గుంత లు ఏర్పడగా 987 రహ దారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ గుంతలను పూడ్చడంతో పాటు దెబ్బతిన్న మార్గాలను వెంటనే పు-న రుద్ధరించేందుకు జీహెచ్‌ఎంసీ రూ.44 కోట్లువెచ్చించింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో బల్దియాపైరూ.44 కోట్లు అనవసర వ్యయం పడింది. పీపీఎంప్రాజెక్ టులో భాగంగా నిర్మించి న రోడ్లు దెబ్బతిం టేపునరుద్ధరణ, మరమ్మతు పనుల్ని కాం ట్రాక్టర్లేనిర్వహిం చాల్సి ఉంటుం ది.
బల్దియాలో భిన్నాభిప్రాయాలు
రోడ్ల నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిం చాలంటూ స్టాండిం గ్ కమిటీచేసిన తీర్మానంపై జీహెచ్‌ఎంసీలోని అధికారవర్గా ల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.