- విస్తీర్ణాన్ని తగ్గించి చూపుతున్నవారిపై ఫోకస్
- ఎన్నికల తరువాత ఏజెన్సీ ఎంపిక, ఆ వెంటనే సర్వే షురూ
- ఏడాదిన్నరలో 20 లక్షల ఇండ్ల సర్వే చేయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ప్రాపర్టీని తక్కువ చేసి చూపించి ట్యాక్స్ఎగ్గొడుతున్న వారిపై జీహెచ్ఎంసీ ఫోకస్పెట్టింది. ప్రాపర్టీ ట్యాక్స్ ను పక్కాగా రాబట్టేందుకు ప్లాన్ చేసింది. బిల్డింగుల విస్తీర్ణాన్ని బట్టి వంద శాతం ప్రాపర్టీ ట్యాక్స్కలెక్ట్ చేయాలని నిర్ణయించింది. త్వరలో గ్రేటర్‌వ్యాప్తంగా జీఐఎస్(జియో ఇన్ఫర్మేషన్ సర్వే) చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. డ్రోన్ల ద్వారా ఈ సర్వే కొనసాగనుంది.
సర్వే బాధ్యతలను మూడేండ్ల కాలపరిమితితో ఓ ఏజేన్సీకి అప్పగించనుంది. బల్దియా అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఎన్నికలు అయిపోగానే ఏజెన్సీని ఫైనల్ చేయనున్నారు. ఆ వెంటనే సర్వే మొదలవుతుంది. ఏడాదిన్నరలో 20 లక్షల భవనాలను సర్వే చేసేలా ఏజెన్సీకి టార్గెట్పెట్టనున్నట్లు తెలిసింది. సర్వే వివరాలను ఏరోజుకారోజు సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు అందించేలా ప్లాన్చేస్తున్నారు.
రిపోర్టు అందగానే సర్కిల్ స్థాయి అధికారులు భవనం విస్తీర్ణం గతంలో ఎంత ఉండేది, తాజాగా ఏమైనా మార్పు ఉందా అన్న వివరాలను పరిశీలించనున్నారు. విస్తీర్ణంలో మార్పు ఉంటే వెంటనే వారి అసెస్ మెంట్ లో విస్తీర్ణాన్ని మార్చి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం రెండున్నరేండ్ల ప్రపార్టీ ట్యాక్స్ ను వెంటనే కలెక్ట్ చేయనున్నారు. ఈ విధమైన సర్వే ఇప్పటికే మహారాష్ట్రలోని బృహన్ముంబై కార్పొరేషన్అమలుచేస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి పనితీరును పరిశీలించారు.
పెరుగుతున్న ట్యాక్స్ కలెక్షన్
బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఏటా పెరుగుతోంది. 2023 –24 ఆర్థిక సంవత్సరంలో రూ.2కోట్ల టార్గెట్పెట్టుకోగా, రూ.1915 కోట్లు వసూలైంది. ఆదాయాన్ని మరింత పెంచేందుకు జీహెచ్ఎంసీ జీఐఎస్సర్వేకు సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో కమర్షియల్, రెసిడెన్షియల్ భవనాల నిర్మాణం జోరుగా సాగుతోంది. అయితే ట్యాక్స్ఎగ్గొట్టేందుకు కొందరు విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తుండగా, ఇంకొందరు ఇల్లీగల్నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి వారికి జీఐఎస్సర్వే చెక్ పెడుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వే అనంతరం బల్దియాకు ఏటా రూ.2,500 కోట్ల ఆస్తి పన్ను వచ్చే అవకాశం ఉంది.