చార్ కమాన్ నుంచి చార్మినార్ వరకు బ్యూటిఫికేషన్​ వర్క్స్

చార్ కమాన్ నుంచి చార్మినార్ వరకు బ్యూటిఫికేషన్​ వర్క్స్
  • చార్ కమాన్ నుంచి చార్మినార్ వరకు బ్యూటిఫికేషన్​ వర్క్స్
  • రూ. 7కోట్ల పనులకు త్వరలో టెండర్లు 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ​ఐకాన్ చార్మినార్ వద్ద బ్యూటిఫికేషన్ పనులకు జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. చార్ కమాన్ నుంచి చార్మినార్ వరకు ఆర్టిఫిషియల్ చెట్లు, స్పెషల్​లైటింగ్​ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డెకరేటివ్ లైటింగ్, కృత్రిమ తాటి చెట్లు, జంక్షన్ వద్ద ఫౌంటెయిన్, లైటింగ్ ఫ్లవర్స్ ఏర్పాటు చేయనుంది. రాత్రి వేళల్లో వచ్చే సందర్శకులకు మంచి అనుభూతిని పంచేలా పనులు చేపట్టనుంది. రూ.7 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. 

ఆ వెంటనే పనులు మొదలుకానున్నాయి. రాష్ట్రంతోపాటు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది పర్యాటకులు చార్మినార్ ని సందర్శిస్తారు.  ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది. బ్యూటిఫికేషన్​పనులు పూర్తయితే చార్మినార్​ప్రాంతం మరింత శోభాయమానంగా మారనుంది. పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చార్ కమాన్ ల నుంచి చార్మినార్ వరకు లైటింగ్ కోసం అల్యూమినియం పోల్స్ 226, 12W ఎల్ఈడీ లైట్లు 40; 90W  లైట్లు 271, 60W లైట్లు13 ఏర్పాటు చేయనున్నారు. చార్మినార్ చుట్టూ లైటింగ్ ఫ్లవర్స్ 2, వాటర్ ఫాంటెన్ 1, ఆర్టిఫిషియల్ ఈత చెట్లు 15 ఏర్పాటు చేయనున్నారు.