ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనివారికి బల్దియా మరో అవకాశం 

ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనివారికి బల్దియా మరో అవకాశం 
  • ఓటీఎస్​ను వాడుకోవాలె
  • ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనివారికి బల్దియా మరో అవకాశం 

హైదరాబాద్​, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్​లో ఉన్న వారికి జీహెచ్ఎంసీ మరో అవకాశం కల్పించింది. 2021–22 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీ రాయితీ ప్రకటించింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) కింద ఒకే సారి పన్ను బకాయిలు మొత్తం చెల్లించేవారికి వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ స్కీమ్​ను  ఈ నెల 17 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. గత ఆర్ధిక సంవత్సరం ట్యాక్స్ బకాయిలతో పాటు గత ఏప్రిల్ మొదలు జులై 17 వరకు చెల్లించాల్సిన పన్నులకు సైతం వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జీహెచ్ఎంసీ  మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో గడిచిన  4 నెలలకు సంబంధించి ట్యాక్స్ కట్టిన వారిలో వడ్డీ కూడా చెల్లించి ఉంటే  ఆ 90 శాతం వడ్డీని 
అడ్వాన్స్ చెల్లింపు కింద జమ చేస్తామని,  అక్టోబర్ 31 నాటికి ఓటీఎస్  అమల్లో ఉండనుందని బల్దియా అధికారులు తెలిపారు.  ప్రాపర్టీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  గ్రేటర్​లో మొత్తం రూ.1,574 కోట్లు బకాయిలు రావాల్సి ఉండగా, ఇందుకు సంబంధించి మరో రూ.1,282 కోట్ల వడ్డీ రూపంలో రావాల్సి ఉంది.  మొత్తం కలిపితే రూ.2,856 కోట్లు బల్దియాకు రావాల్సి ఉంది.