హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సైబర్ టవర్స్ దగ్గర అధునాతన హంగులతో కూడిన సైన్స్ పార్క్ నిర్మించబోతోంది. ఈ పార్క్ లో కూర్చొని ఉద్యోగులు పనిచేసుకోవచ్చు. అందుకు వీలుండేలా సీట్లు, ఛార్జింగ్ పాయింట్లు, వైఫై కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్ గా పిలిచే ఈ పార్క్ లో సైన్స్ పరికరాలు, సైన్స్ కాన్సెప్ట్ లు నేర్చుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తేనున్నారు.
వీటితో పాటు పార్కులో ఓపెన్ జిమ్ కూడా ఉండబోతుంది. అన్ని వయసుల వారిని ఈ పార్క్ లోకి అనుమతిస్తారు. సీనియర్ సిటిజన్స్, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్ చుట్టూ ఐటీ కంపెనీలు, హాస్టళ్లు, గెస్ట్ హౌజ్ లు, హాస్పిటల్స్, రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు పార్క్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వాష్ రూమ్స్, సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఈ పార్క్ లో ఉన్నాయి.