రాష్ట్రంలో రుతుపవనాల రాకతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం హైదరాబాద్లోని నిర్మాణ రంగంపై పడింది. వర్షాలు కురుస్తుండటంతో కొత్తగా నిర్మించే సెలర్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. జులై 1 నుంచి సెప్టెంబర్30 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది. గతంలో జూన్ 15 నుంచే ఈ నిబంధనలు అమలు చేసేవారు కానీ ఈ సీజన్లో వర్షాలు కాస్త ఆలస్యంగా స్టార్ట్ కావడంతో జులై నుంచి అమల్లోకి తెచ్చారు.
సెల్లార్లు తవ్వేటప్పుడు చుట్టుపక్కల భవంతుల పునాదులు కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు మట్టి చెరియలు విరిగిపడి కూలీలు మరణించే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. అందుకే సెల్లార్ల తవ్వకాలపై నిషేధం విధించినట్లు అధికారులు చెప్పారు. నిబంధనలను ఎవరు అతిక్రమించినా క్రిమినల్కేసులు పెడతామని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.