
జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లను అధికారులు వేగవంతం చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు ఉన్న వారికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల వసూళ్ల కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో వందమందికి రెడ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించని వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు. రూ. 5 లక్షలకు పైన ఉన్న బకాయిల విలువ రూ 860 కోట్లు ఉన్నాయని అధికారులు తేల్చారు.
బకాయిల వివరాలు
- జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ : రూ.52 కోట్లు
- హైద్రాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ : రూ.30 కోట్లు
- ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ : రూ. 5 కోట్ల 50 లక్షలు
- సోమాజిగూడ లోని కత్రియా హోటల్:రూ. 8 కోట్ల 62 లక్షలు
- ఎల్ అండ్ టీ మెట్రో రైల్: రూ.32 కోట్లు
- ఇండో అరబ్ లీగ్ : రూ.7 కోట్ల 33 లక్షలు