- మాన్యువల్‌కు చెక్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ డిజిటల్ పేమెంట్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లులను మాన్యువల్‌గా చెల్లించింది. తాజాగా ఆ ప్రాసెస్‌కు కమిషనర్రోనాల్డ్రోస్చెక్పెట్టారు. ఇప్పటికే అమలవుతున్న హెచ్ఆర్ఎంఎస్, బ్యాంక్‌ఖాతాలను అనుసంధానం చేసుకుని ఇకపై డిజిటల్ చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సర్కిల్, జోన్ స్థాయి ఉద్యోగులకు సంబంధించిన వేతనాలను సర్కిళ్లు, జోన్ల నుంచి వచ్చే బిల్లుల ప్రకారం చెక్కుల ఆధారంగా చెల్లింపులు జరిపారు. ఇక నుంచి హెచ్ఆర్ఎంఎస్ లో ఉద్యోగులు హాజరు, గైర్హాజరు వివరాలను ఆధారంగా చేసుకుని డిజిటల్ చెల్లింపులు చేస్తామని కమిషనర్ వెల్లడించారు.
డీఆర్సీల తనిఖీ
సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, స్ట్రాంగ్‌రూమ్‌లను సిటీ సీపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆర్ఓ అనుదీప్, అడిషనల్ సీపీ తదితరులు పాల్గొన్నారు.
అలాగే జిల్లా ఎన్నికల పరిశీలకులు సెంథిల్ కుమార్, అమిత్ శుక్లా శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ, ఎంసీఎంసీ, ఎక్సైజ్, పోలీస్, ఐటీ, డీజీసీ, ఈఈఎం తదితర నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఆయా కమిటీల ద్వారా నిర్వహిస్తున్న విధులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.