
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్) ద్వారా ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి రూ.రూ.136.30 కోట్ల ఆదాయం వచ్చింది. -2020లో ఎల్ఆర్ఎస్ కింద బల్దియాకు 1,07,872 దరఖాస్తులు రాగా, ఇందులో సరైన పేపర్లతో అప్లై చేసిన 63,803 మంది దరఖాస్తుదారులకు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారు. మిగతా వాటికి సంబంధించి లింక్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్, ప్లాన్, ఎఫ్టీఎల్, బఫర్, సర్కార్ భూములా, డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చూసి వారికి కూడా ఫీజు ఇంటిమేషన్ లెటర్లను పంపనున్నారు.
ఇప్పటి వరకు 25 శాతం రాయితీతో 10,957 మంది దరఖాస్తుదారులు రెగ్యులరైజేషన్ఫీజు చెల్లించగా రూ.136.30 కోట్ల ఆదాయం వచ్చింది. ముందుగా ఈ ఏడాది మార్చి చివరి వరకు మాత్రమే గడువు ఇవ్వగా, ఈ నెలాఖరు వరకు పెంచారు. మార్చిలో రూ.103 కోట్లు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు రూ.33 కోట్లు వచ్చింది. ఎల్ఆర్ఎస్దరఖాస్తుల విషయంలో సందేహాలు ఉంటే బల్దియా ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్కుల్లో సిబ్బందిని సంప్రదించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.