హైదరాబాద్ లో తొలి ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభమైంచారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సోమవారం ( జనవరి 20, 2025 ) ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు మేయర్. ఈ క్యాంటీన్ ను ఎన్.బి.టి నగర్ కు చెందిన స్వయం సహాయక బృంద సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మేయర్ విజయలక్ష్మి. మహిళ సంఘాలు ఆర్ధికంగా ఎదిగే దశలో భాగంగా... రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని అన్నారు.
క్యాంటీన్ నిర్వహకులను స్వయం సహాయక బృంద సభ్యులను అభినందించిన మేయర్... ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు స్వయం సహాయక బృందాలు... కనీసం 5 సార్లు బ్యాంక్ నుంచి తమ గ్రూప్ కు రుణం మంజూరు అయ్యే వారు అర్హులన్నారని వెల్లడించారు. రుణ మంజూరు నుంచి తిరిగి చెల్లించే వారికి... క్యాంటీన్ ఏర్పాటుకు అర్హులని అన్నారు.
ఏ రంగంలోనైనా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని... దీనివల్ల కూడా మహిళలు మరింత ఆర్ధికంగా బలపడి అవకాశం ఉంటుందని అన్నారు మేయర్ విజయలక్ష్మి.