మెరుగైన సేవలు అందించేందుకు కృషి : జీహెచ్ఎంసీ మేయర్​ గద్వాల్ ​విజయలక్ష్మి

మెరుగైన సేవలు అందించేందుకు కృషి : జీహెచ్ఎంసీ మేయర్​ గద్వాల్ ​విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర ప్రజలకు అన్ని సౌకర్యాలతో మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. శనివారం రూ.3కోట్ల54 లక్షల అంచనా వ్యయంతో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ తో ఆమె శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

తాజ్ కృష్ణ జంక్షన్‌లో రూ.11.5 లక్షలతో, జీవీకే మాల్ ఎదురుగా రూ. 12.75 లక్షలతో చేపట్టిన బ్యూటిఫికేషన్​ను ప్రారంభించారు. రూ.25 లక్షలతో జవహర్ నగర్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ మినీ థియేటర్ ను ఓపెన్​చేశారు. కేబీఆర్​పార్క్ జంక్షన్ లో రూ.1.96 లక్షల వ్యయంతో చేసిన ఏర్పాటు చేసిన ఆర్ట్​ను ప్రారంభించారు. 

అలాగే పలు రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఎస్ఈ రత్నాకర్, కార్పొరేటర్ మన్నె కవిత, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.