త్వరలో డివిజన్లలో పర్యటించి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటా
సంబంధిత కార్పొరేటర్లతో చర్చించి పరిష్కరిస్త
విమెన్ సేఫ్టీ, డెవలప్మెంట్ కు టాప్ ప్రయారిటీ
బస్తీ దవాఖానలు పెంచుతా.. నేనూ అక్కడే చెకప్ చేయించుకుంటా
కమ్యూనిటీ హాల్స్‌లో ఫ్రీగా ఫంక్షన్లు చేసుకునేలా మారుస్త
కొత్త మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో
‘వీ6 వెలుగు’ స్పెషల్ ఇంటర్య్వూ
వెలుగు : తెలంగాణ వచ్చాక గ్రేటర్ హైదరాబాద్ ఫస్ట్ మహిళా మేయర్‌గా మీ ఫీలింగ్?
మేయర్: మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరం మహిళలమే కావడం చాలా హ్యాపీగా ఉంది.
సిటీలోని ప్రాబ్లమ్స్ పరిష్కారానికి మీ ప్లాన్ ?
నా ముందు ఐదారు ఇష్యూస్ ఉన్నవి. విద్య, వైద్యం, విమెన్ సేఫ్టీ, డ్రైనేజీ, పొల్యూషన్ వంటి వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తా . కొద్దిరోజుల్లో అన్ని డివిజన్లలో పర్యటిస్తా. స్థానిక సమస్యలను ఐడెంటిఫై చేస్తా . ప్రజలను కలిసి వాళ్లు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ తెలుసుకుంటా. వాటిపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటా.
మొన్నటి వరకు మీరు డివిజన్ కార్పొరేటర్. ఇప్పుడు మేయర్. సిటీ లో ఏదైనా
ఇష్యూ వస్తే ఎలా స్పందిస్తారు?
వర్క్ చేయడానికి ఇష్టపడతా. అండర్ ప్రివిలైజ్డ్ఎవరైతే ఉన్నారో వాళ్లకోసం నేను ఐదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నా. ‘‘యూఎస్ నుంచి వచ్చింది, ఆమెకు ఏం తెలుసు’’ అని అనుకుంటున్నారు. కానీ ఈ ఐదేళ్లలో చాలా నేర్చుకున్నా. ఏ సమస్యపైనైనా కార్పొరేటర్ గా ఉన్నప్పుడు నా పరిధికే పరిమితమయ్యా. ఇప్పుడు మేయర్అవడంతో బాధ్యత పెరిగింది. లోకల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లే సిటీ వైడ్ గా పరిష్కరిస్తా . కార్పొరేటర్స్ తో రెగ్యులర్ గా మాట్లాడతా . నెలా, రెండు నెలలకోసారి మీటింగ్స్ కండక్ట్ చేస్తా.
లేడీ మేయర్‌గా మహిళలకు మీపై ఎన్నో ఆశలున్నాయి? వారికి ఎలా భరోసా కల్పిస్తారు?
ఇప్పటికే సిటీలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ పని చేస్తున్నాయి. మహిళల సాధికారత కోసం రుణాలిచ్చి సహాయ పడతాం. వాళ్ల సేఫ్టీ గురించి ప్రత్యేకంగా దృష్టి పెడతా.
కౌన్సిల్ మీటింగ్‌లో కార్పొరేటర్లను
కలుపుకుని వెళ్తారా?
తప్పకుండా. కార్పొరేటర్లు అందరూ నా కుటుంబసభ్యులే. నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తా. అందరిని కలుపుకుని వెళ్తా. సమస్యలను అధిగమించేందుకు పార్టీలను పట్టించుకోకుండా పనిచేస్తా.
మీ పార్టీకి ఈసారి కౌన్సిల్ లో మెజారిటీ బలం లేదు. మిగతా పార్టీల కార్పొరేటర్ల సూచనలు వింటారా?
కౌన్సిల్ జరిగేదే సమస్యలు తెలుసుకోవడానికి. దాని ద్వారానే ప్రజల సమస్యలు తెలుస్తాయి. అందరూ చెప్పేది వింటా . ప్రభుత్వాన్ని పొగడటం మాత్రమే ఉండదు. ఏం చేయలేకపోతున్నాం అనేది తెలుసుకుని దాన్ని మంచిగా చేయాలని చూడటానికే సభ నడుపుతాం. ఇద్దరి సైడ్ వినాలి. వింటాను కూడా. కౌన్సిల్ సమావేశంలో అన్ని పార్టీల కార్పొరేటర్లకు చర్చించేందుకు అవకాశం కల్పిస్తా.
వరద సమయంలో చాలా మంది కార్పొరేటర్లు స్థానికంగా కనిపించ లేదనే ఆరోపణలు జనం నుంచి వచ్చాయి.
మీ పాలనలో ఏదైనా మార్పు ఉంటుందా?
ముందుగా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తా. ఓటు వేసి గెలిపించినప్పుడు మన బాధ్యత వాళ్లకు కావాల్సిన సేవలందించడం. మేయర్‌గా అన్ని డివిజన్లు, బస్తీలకు వెళ్తా . సీఎం కేసీఆర్ కూడా ఇదే చెప్పారు. బస్తీలో తిరగాలని, ప్రజల్లో ఉండాలని, ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని సూచించారు. లీడర్ ఫస్ట్ ఓపిక గా ఉండాలి. ప్రజలు చెప్పింది వినాలి. ప్రజలు ఏమన్నా, కోపం చేసినా పట్టించుకోకుండా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తా.
ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ సరిగా లేవు. వాటిపై మీరు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు?
ఇది స్టేట్ లెవల్ ఇష్యూ. మినిస్టర్ చూస్తారు. సిటీలోని బస్తీల్లో దవాఖానాలు పెంచితే మంచిదని భావిస్తున్నా. ఇక నుంచి నేను కూడా బస్తీ దవాఖానాకే వెళ్లి చెక్ చేయించుకుంటా. ఒక్కో బస్తీ దవాఖానలో డాక్టర్లు ప్రతిరోజు 2 00 మందికి పైగా పేషెంట్లకు ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడున్న బస్తీ దవాఖానలతో పాటు పెద్ద ఏరియాల్లో ఇంకో రెండు దవాఖానలు యాడ్ చేయాలనే ఆలోచన ఉంది. దీంతో పాటు కమ్యూనిటీ హాల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే లక్ష నుంచి 2 లక్షల కంటే తక్కువకి ఫంక్షన్ హాల్ దొరకడంలేదు. అదే పెద్ద కమ్యూనిటీ హాల్ ఉంటే ఫ్రీగా పెళ్లిళ్లు చేసుకోవచ్చు. కమ్యూనిటీ హాల్స్ మీద కాన్సట్రేషన్ చేస్తా. ఓపెన్ ల్యాండ్ దొరికితే తహసీల్దార్ల సహకారంతో మరిన్ని హాల్స్ కట్టిస్తా.
విమెన్ సేఫ్టీకి ప్రయారిటీ
సిటీలో మహిళలపై రోజూ ఏదో ఒకచోట ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు?
మహిళల రక్షణకే నా టాప్ ప్రయారిటీ. నేను లాయర్ ని. డొమెస్టిక్ వయొలెన్స్ , ఫ్యామిలీ ఇష్యూస్ తో చాలామంది క్లయింట్లు వచ్చేవారు. వారి ప్రాబ్లమ్స్ ని నేనే సాల్వ్ చేశా . మహిళల సేఫ్టీకి సంబంధించి ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా వెళ్తా.
మీ ముందు అనేక సవాళ్లున్ నాయి? ఏం చేయబోతున్నారు?
నా డివిజన్ వరకు అన్ని విషయాలు తెలుసు.
త్వరలోనే సిటీలోని అన్ని డివిజన్లలో పర్యటించి
కార్యాచరణ రూపొందించి దానికి అనుగుణంగా
ముందుకు సాగుతా. ఎప్పటికప్పుడు కార్పొరేటర్లతో
చర్చిస్తూ నిర్ణయాలు తీసుకుం టా. సిటీ అభివృద్ధే
నా లక్ష్యం. దాని కోసం ఏమైనా చేస్తా
‘గ్రేటర్ లో విద్య, వైద్యం, విమెన్ సేఫ్టీ, డ్రైనేజీ, పొల్యూషన్ ఇలా ఐదు ఇష్యూస్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తా. త్వరలోనే అన్ని డివిజన్లలో పర్యటిస్తా. ప్రజలను కలిసి వారి ప్రాబ్లమ్స్తెలుసుకుంటా. కార్పొరేటర్లతో చర్చించి పరిష్కరిస్తా. బస్తీల్లో దవాఖాన లు మరిన్ని పెంచుతా. ఇక నుంచి నేను కూడా బస్తీ దవాఖానకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటా.కమ్యూ నిటీ హాల్స్‌లో పేదలు ఫ్రీగా ఫంక్షన్లు చేసుకునేలా అందుబాటులోకి తెస్తా. సిటీ డెవలప్మెంట్కు కష్టపడతా. పార్టీలకతీతంగా కార్పొరేటర్లందరిని కలుపుకుని పోతా.’ అని చెప్పారు గ్రేటర్ కొత్త మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. శుక్రవారం ‘వీ6 వెలుగు’కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సిటీ సమస్యలపై, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాననే అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. – హైదరాబాద్, వెలుగు