బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు వరసగా రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. మేయర్ ఇంట్లోనే ఆమెతో చర్చలు జరుపుతున్నారు. మున్షీతో పాటుగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా ఉన్నారు.
కాంగ్రెస్ లోనికి రావాలని తనను దీప దాస్ మున్షీ ఆహ్వానించారని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుందని.. రెండు సార్లు తనని గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనన్నారు.
బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు కూమార్తెనే గద్వాల విజయలక్ష్మి2016లో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు 2021లో రెండవసారి గెలిచి, మేయర్‌గా ఎన్నికయ్యారు.
ALSO READ :- తగ్గేదేలా : రాజీనామా చేయరు.. జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పాలన
కాగా హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లపై హస్తం నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ లోకి పదికి పైగా కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ మధ్యే డిప్యూటీ మేయర్ మోత శ్రీలత రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.