హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. శనివారం (మార్చి 30) సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు విజయలక్ష్మీ తెలిపారు. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు.
మరోవైపు తాను పార్టీ మారుతున్న ట్లు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎంపీ కేకేశవరావు స్పందించారు. కాంగ్రెస్ లో చేరితే తప్పేంటని అన్నారు.. పార్టీ అంతర్గత విషయాలపై చర్చించేందుకే కేసీఆర్ తో సమావేశం అయ్యానను. తాను కాంగ్రెస్ చేరడంపై ఇప్పటికిప్పుడే క్లారిటీ ఇవ్వలేనని బీఆర్ ఎష్ సీనియర్ నేత కేశవరావు చెప్పారు.
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు కేకే కుమారుడు విప్లవ్ కుమార్.బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా.. కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది.ఇక కేకే, విజయలక్ష్మీ పార్టీమార్పుపై వారు క్లారిటీ ఇచ్చాకే నేను స్పందిస్తానన్నారు విప్లవ్ కుమార్.