హైదరాబాద్ మేయర్ కు సింగపూర్ పిలుపు

హైదరాబాద్ మేయర్ కు సింగపూర్ పిలుపు

సింగపూర్ నగరం నుంచి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఆహ్వానం అందింది. సింగపూర్ లో 2024 జూన్ 2 నుండి 4 వరకు జరిగే  9వ వరల్డ్ సిటీ సమ్మిట్ లో బాగస్వామ్యం కావాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కు సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ కోరారు. గురువారం, ఫిబ్రవరి 29న హైదరాబాద్ లో ఆమెను కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. పట్టణాలు ఎలా అభివృద్ధి చెందాలి, స్థిరమైన నివాసానికి ఎలా అవస్థాపన సౌకర్యాలు కల్పించాలని సూచనలు ఇవ్వాలని సింగపూర్ ప్రతినిధి బృందం మేయర్‌ను కోరింది. వరల్డ్ సిటీ సమ్మిట్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద నగరాల మేయర్లు, ఇంజినీయర్లు, డెవలప్ మెంట్ అథారిటీ సంస్థలు పాల్గొంటారు. సిటీ జీవనంలో ఎదురైయే సవాళ్లను ఎలా ఎదుర్కొనాలని చర్చింస్తారు. 

ఈ వేదిక పై నివాసయోగ్యమైన స్థిరమైన నగరాల సమస్యలు, పునరుజ్జీవనం, పునర్నిర్మాణం, రీ-ఇమేజింగ్ గురించి మేయర్‌లు, వ్యాపార నాయకులతో చర్చించనున్నారు. స్మార్ట్ సిటీల లక్ష్యాలను సాధించడానికి పరిష్కారాలు, ప్రస్తుత మరియు భవిష్యత్తులో అందరికీ మెరుగైన నగర జీవితాన్ని అందించడం గురించి చర్చిస్తారు. 

ALSO READ :- కారు ప్రాజెక్టుకు యాపిల్ కంపెనీ బ్రేక్

ఈ సందర్భంగా మేయర్ వారితో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను 'టాప్ సిటీ'గా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ కృషి చేస్తుందన్నారు. సామాజిక, ఆర్థిక పథకాలకు సిగ్నల్ రహిత నగరంగా ఇక్కడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని ఆమె వివరించారు. కార్యక్రమంలో సింగపూర్ వైస్ కాన్సల్ మెంబర్ నికోల్ చెన్ తదితరులు పాల్గొన్నారు.