సిటీలో వర్షాలపై మేయర్ వ్యూహమిదే..

సిటీలో వర్షాలపై మేయర్ వ్యూహమిదే..

హైదరాబాద్: ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి తెలిపారు. వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తానని ఆమె అన్నారు. నగరంలో ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా వెంటనే సిబ్బందిని అక్కడికి డ్రైవర్ చేస్తామని మేయర్ తెలిపారు. అదేవిధంగా గత ఏడాది ఏ ఏరియాల్లో ఇబ్బందులు వచ్చాయో.. అక్కడ ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ అలెర్ట్‎గా ఉన్నాయని మేయర్ తెలిపారు.

For More News..

రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు