హైదరాబాద్, వెలుగు: సమాజ సేవలో యువత ముందుండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి ముషీరాబాద్ సర్కిల్ జాంభవి నగర్ లో వరద నీటిలో కొట్టుకుపోతున్న కారులోని వారిని రక్షించిన ఇంటర్స్టూడెంట్లు ప్రణీత్ యాదవ్, మోహన్ యాదవ్, నాగరాజుచారి, మార్టిన్ ను మేయర్ మంగళవారం అభినందించారు. బల్దియా హెడ్డాఫీసుకు పిలిపించి శాలువాలతో సన్మానించారు. కాపాడిన తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్, సంబంధిత అధికారులు, యువకుల పేరెంట్స్పాల్గొన్నారు. అలాగే జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులోని కట్టమైసమ్మ ఆలయంలో మంగళశారం బోనాలు ఉత్సవాలు, కల్యాణం నిర్వహించారు. మేయర్విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి జోన్ యూసుఫ్ గూడ సర్కిల్ బోరబండ డివిజన్ కు సంబంధించిన అభివృద్ధి పనులపై మేయర్సమీక్షించారు. కార్పొరేటర్ మహమ్మద్ బాబా ఫసియుద్దీన్ తో సంబంధిత అధికారులతో మాట్లాడారు. శానిటేషన్ నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు.