హైదరాబాద్, వెలుగు: ఉదయం 10.30 గంటల కల్లా ఆఫీసులో ఉండాలని మేయర్ గద్వాల్విజయలక్ష్మి జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బందిని ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్గ్రౌండ్ఫ్లోర్లోని పలు సెక్షన్లను మేయర్ బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఒక్కొక్కరితో మాట్లాడి ఏ టైమ్‌కు వచ్చారో ఆరా తీశారు.
ప్రజా సమస్యలకు సంబంధించిన ఫైల్స్‌ను పెండిగ్పెట్టొద్దని, వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. క్రమశిక్షణ లేకుంటే సహించబోమని హెచ్చరించారు. రోజూ అన్ని విభాగాల అటెండెన్స్రిజిస్టర్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉదయం 10:45 గంటల లోపే రిజిస్టర్లను తన చాంబర్ కు పంపాలని ఆదేశించారు. మేయర్ వెంట ఓఎస్డీలు విజయకృష్ణ, అనురాధ, సీపీఆర్ఓ ముర్తుజా అలీ తదితరులు ఉన్నారు.