సీల్డ్ కవర్​లో మేయర్ పేరు.. ఆశావహుల్లో టెన్షన్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్  మేయర్​ ను సీల్డ్ కవర్ ద్వారా ఈనెల 11 న వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరిని మేయర్ క్యాండిడేట్ గా ప్రకటిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మేయర్ సీటు కోసం ఈసారి టీఆర్​ఎస్​లో  పోటీ నెలకొంది. రేసులో ఉన్న వాళ్లంతా  హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేయగా ఎవరికీ హామీ ఇవ్వలేదు.  మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఎవరిని ఎంపిక చేసినా కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లంతా వారికే ఓట్లేయాలని సీఎం ఆదేశించారు.  రేస్ లో  ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ విజయా రెడ్డి, భారతీనగర్‌‌‌‌‌‌‌‌  కార్పొరేటర్​ సింధూ రెడ్డి, వెంకటేశ్వరనగర్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ మన్నె కవితారెడ్డి, తార్నాక కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ మోతె శ్రీలత రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్​ బొంతు శ్రీదేవి, హఫీజ్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్​పూజిత, అల్వాల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ విజయశాంతి, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

పీపీపీ మోడ్​లో మూసీ నది బ్యూటిఫికేషన్​

నయిమ్ ప్రధాన అనుచరుడు ఎండి నాసర్ మృతి

వెదురు సాగుకు ఎదురుదెబ్బ..రాష్ట్ర వాటా చెల్లించని సర్కారు