హైదరాబాద్ : GHMC నిర్లక్ష్యానికి ఓ వాహనదారుడి కాలు విరిగింది. రోడ్డుపై ఏర్పడిన గుంతలు పూడ్చకపోవటంతో.. బైక్ పై వెళుతున్న భార్యాభర్తలు కింద పడిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విజయ్, రజిత భార్యాభర్తలు. హయత్ నగర్ కుంట్లూరులో నివాసముంటూ.. కొత్తపేట లోని రిలయన్స్ ట్రెండ్ లో జాబ్ చేస్తారు. భార్యాభర్తలు బైక్ పై డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఎల్బీ నగర్ చింతలకుంట దగ్గర రోడ్డుపై గుంత ఉండటంతో.. బైక్ పైనుంచి పడిపోయారు.
ప్రమాదంలో విజయ్ కాలు విరగగా.. ఆయన భార్యకు గాయాలయ్యాయి. రోడ్డుపై గుంతలు ఏర్పడినా.. ghmc వాటిని పూడ్చకపోవడంతో పాటు ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం బైక్ పై వెళుతున్న వ్యక్తి గుంతలో పడి గాయాలైనా అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు స్థానికులు.