దోమలను చంపనీకి కొత్త స్ప్రే! 

దోమలను  చంపనీకి కొత్త స్ప్రే! 

హైదరాబాద్, వెలుగు : గ్రేట ర్ లో దోమల నివార ణ కు జీహెచ్‌ ఎంసీ కొత్త మందు వాడుతోంది. దోమలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో అల్ఫాసైఫ ర్ మిథేన్ అనే కెమికల్ ను స్ప్రే చేస్తోం ది. ఇళ్లు , స్కూళ్ల భవనాల గోడ ల పై స్ప్రే చేస్తే ప్రత్యేక పొరగా ఏర్పడుతుంది. దోమ లు గోడల పై వాలిన
వెంట నే చ నిపోతాయి. ఒక్కసారి స్ప్రే చేస్తే 45 రోజుల పాటు ప్రభావం ఉంటుంది.ఇప్పటికే 2,443 ప్రభుత్వ, ప్రైవేట్‌‌,ఎయిడెడ్ స్కూళ్లలో డ్రైవ్‌ చేపట్టారు .1,361 స్కూళ్లలో చైత న్య కార్యక్రమాలు నిర్వహించారు.