ఎత్తేసిన చెత్త పాయింట్లలో చాయ్ పే చర్చ

  • క్యారమ్స్ , చెస్ ఆడుతూ చెత్త వేయొద్దని అవగాహన 
  • చెత్త వేస్తే వెయ్యి ఫైన్ వేస్తాం.. ఏఎంహెచ్ ఓ రజినీకాంత్ 

సీతాఫల్ మండి, వెలుగు : మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చాయ్ పే చర్చ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు సికింద్రాబాద్ సర్కిల్ ఏఎమ్ హెచ్ఓ రజనీకాంత్ తెలిపారు. గురువారం సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో తొలగించిన గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద  కూర్చొని చాయ్ పే చర్చ చేశారు.

క్యారమ్స్, చెస్ ఆడుతూ చెత్త వేయొద్దని ప్రజలకు సూచించారు. ఏఎమ్ హెచ్ఓ మాట్లాడుతూ మన ఇంట్లోని చెత్తని చుట్టుపక్కల పడవేయకుండా ఇంటికి వచ్చే ఆటోల్లో వేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ. 1000 ఫైన్ వేస్తామని స్పష్టంచేశారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.