బంజారాహిల్స్ HDFC టవర్స్ సీజ్ చేస్తున్నాం.. రోక్సానా బిల్డింగ్కు జీహెచ్ఎంసీ నోటీసులు

బంజారాహిల్స్ HDFC టవర్స్  సీజ్ చేస్తున్నాం.. రోక్సానా బిల్డింగ్కు జీహెచ్ఎంసీ నోటీసులు

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవలే ట్యాక్స్ చెల్లించడం లేదని కాచిగూడలోని ప్రతిమా హాస్పిటల్ సీజ్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చిన జీహెచ్ఎంసీ.. తాజాగా మరో బంజారాహిల్స్ లో రోక్సానా బిల్డింగ్ కు నోటీసులు ఇచ్చారు. గత ఏడేళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనందున బిల్డింగ్ ను సీజ్ చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్1 లోని రోక్సాన టవర్ బిల్డింగ్ ను సీజ్ చేయడానికి గురువారం (మార్చి 20) జీహెచ్ఎంసీ అధికారులు చేరుకున్నారు. ప్రాపర్టీ ట్యా్క్స్ పెండింగ్ లో ఉన్నందున సీజ్ చేస్తామని నోటీసులు ఇచ్చారు. 

ALSO READ | చందానగర్ లోని గంగారం పెద్దచెరువుపై హైడ్రా ఫోకస్..

రోక్సాన బిల్డింగ్ కు HDFC  బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు ఓనర్లు. అయితే గత ఏడు సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారు బ్యాంకు నిర్వాహులు. దీనిపై  గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించడం లేదని చెబుతున్నారు. ట్యాక్స్ కట్టకుండా ఇన్నాళ్లుగా కనీసం స్పందించడం లేదనే కారణంగా బిల్డింగ్ ను  సీజ్‌ చేయడానికి వచ్చామని అధికారులు తెలిపారు. 

హెచ్డిఎఫ్సి బ్యాంక్ టవర్ నుంచి 43 కోట్ల రూపాయల ట్యాక్స్ పెండింగ్ లో ఉందని అధికారులు తెలిపారు. సీజ్ చేయడానికి వచ్చిన అధికారులతో బిల్డింగ్ ఓనర్ చర్చ జరిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తామని.. సాయంత్రం లోగా టైమ్ ఇవ్వాలని అధికారులను కోరారు బిల్డింగ్ ఓనర్. సాయంత్రం వరకు గడువు ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు.