
హైదరాబాద్ సిటీ, వెలుగు: మురుగు నీటి పైపు లైన్లలో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించే ‘సీవర్ క్రోక్’ రోబోటిక్ మెషీన్పనితీరును జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు ఇలంబరితి, ఏవీ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. సచివాలయం ముందున్న డ్రైన్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. మురుగు, వరద రోడ్లపై పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో సీవర్ క్రోక్ ఎంతవరకు ఉపయోగపడుతుందన్న దానిపై పరిశీలన జరిపారు. మ్యాన్‌హోల్‌లో మనుషులు దిగాల్సిన పని లేకుండా చెత్తను తొలగించే తీరును చూశారు.
మురుగు ముప్పు ఉన్న ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని అక్కడ సీవర్క్రోక్ను వినియోగించాలని నిర్ణయించారు. మురుగునీటి లైన్లను శుభ్రం చేయడానికి సీవర్ క్రోక్‌ను గతంలో వాటర్ బోర్డు వినియోగించిన విషయాన్ని అజంతా టెక్నో సొల్యూషన్స్ సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ జర్మయ్య గుర్తుచేశారు.