సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఉంటున్న తన ఇంటిని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా GHMC అధికారులు కూల్చివేశారన్నారు రంజీ ప్లేయర్ శ్రావణి. 35 ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నామన్నారు. పోలీసులతో.. ఎమ్మెల్యే పద్మారావు కొడుకు తమను బెదిరించారని ఆరోపించారు శ్రావణి. అయితే బాధితురాలికి అండగా ఉండి న్యాయం చేస్తామన్నారు బీజేవైఎం నాయకులు సందీప్ గౌడ్. క్రీడాకారిణికి ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి ఇళ్లు వాకిలి లేకుండా చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.