- ఇల్లీగల్ నిర్మాణాన్ని కూల్చేయాలని కోర్టు ఆదేశం
గచ్చిబౌలి, వెలుగు : కొండాపూర్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలోని విజేత సూపర్ మార్కెట్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. మార్కెట్నడుస్తున్న బిల్డింగ్అక్రమ నిర్మాణమని, వెంటనే కూల్చివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శేరిలింగంపల్లి సర్కిల్టౌన్ప్లానింగ్, స్పెషల్ టాస్క్ఫోర్స్అధికారులు గురువారం మార్కెట్‌ను క్లోజ్ చేసి, సీజ్ చేశారు. విజేత సూపర్ మార్కెట్ బిల్డింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవని కుమార్ యాదవ్ అనే వ్యక్తి కొన్ని నెలల కింద జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
అలాగే సిటీ స్మాల్కాసెస్కోర్టును ఆశ్రయించాడు. స్పందించిన కోర్టు సూపర్మార్కెట్నిర్మాణాన్ని కూల్చివేయాలని శేరిలింగంపల్లి సర్కిల్ డీసీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ల్యాండ్ఓనర్హైకోర్టులో రిట్పిటిషన్దాఖలు చేశాడు. దీంతో కూల్చివేత ఉత్తర్వులపై సిటీ స్మాల్ కాసెస్ కోర్టు స్టేటస్కో ఇచ్చింది. తాజాగా హైకోర్టు సిటీ స్మాల్కాసెస్కోర్టు ఉత్తర్వులను సమర్థించడంతో గురువారం టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పెషల్ టాస్క్ఫోర్స్డీఈ విశాలలక్ష్మి ఆధ్వర్యంలో బిల్డింగ్‌ను సీజ్ చేశారు.