హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్‌కు జీహెచ్ఎంసీ అధికారులు వేణుగోపాల్ రెడ్డి (అడిషనల్ కమిషనర్), ప్రశాంతి (డిప్యూటీ కమిషనర్), యోగేశ్ (అర్బన్ ప్లానర్) ఎంపికయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అర్బన్ 95 అకాడమీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా, తొలుత12 వారాల ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులో 30 దేశాల నుంచి 50 నగరాలు ఎంపికయ్యాయి.
కోర్సులో ప్రతిభ కనబరిచిన ఎనిమిది దేశాలకు చెందిన 10 నగరాల అధికారులను, మరింత విస్తృత అధ్యయనం కోసం లండన్‌కు వారం పాటు ఆహ్వానించారు. అవసరాలకు అనుగుణంగా నగర నిర్మాణం, వసతుల కల్పనపై దృష్టి పెట్టడం ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.