రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన GHMC అధికారి

రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన GHMC అధికారి

ఓ ఫైల్ పై సంతకం చేసేందుకు లంచం డిమాండ్ చేసిన GHMC ఆఫీసర్ మంగళవారం రెడ్ హ్యాడెండ్‌గా ఏసీబీ పట్టుకుంది. రాజేంద్రనగర్ జీహెచ్ఎమ్ సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెన్కోబా ఇటీవల గోషామహల్ కు బదిలీ అయ్యాడు. రాజేందర్ నగర్ సర్కిల్ 11 జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ వెన్కోబా కాంట్రాక్టర్ దగ్గర బిల్లులు పాస్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. మెజర్‪మెంట్స్ సంబందించిన కాంట్రాక్టర్ వర్క్ పూర్తి కావడంతో.. బిల్లులు పాస్ చేసేందుకు ఏఈ వెన్కోబాను ఆశ్రయించారు. 

ALSO READ | రూ.3 లక్షల లంచం: ఏసీబీకి అడ్డంగా దొరికిన మెడికల్ కళాశాల ఏవో, జూనియర్ అసిస్టెంట్

బిల్లులు అప్రూవ్ చేయడానికి రూ.50 వేలు ఇవ్వాలని అధికారి కోరారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం4 గంటల సమయంలో ఏఈ వెన్కోబా లంచం తీసుకుంటుండంగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అబిడ్స్ లోని జిహెచ్ఎంసి కార్యాలయంలో సోదాలు నిర్వహించి, న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.