హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీ గార్డ్ బెస్తవాడలో జీహెచ్ఎంసీ అధికారులు ఇండ్లను ఖాళీ చేయిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు బెస్తవాడ వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేయిస్తుండడంతో స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య ఇండ్లను ఖాళీ చేయిస్తున్నారు.
కొంతమంది పార్కు స్థలంలో గుడిసెలు వేసుకోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు చాలాసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా గుడిసెలు ఖాళీ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు.