హైదరాబాద్, వెలుగు : వానాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్‌పరిధిలోని పురాతన భవనాలను గుర్తిస్తున్నారు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన సర్వేలో 566 పాత భవనాలను గుర్తించారు. నోటీసులు జారీ అవసరమైన రిపేర్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న వాటిని సీజ్‌చేసి కూల్చేస్తున్నారు. ఇప్పటివరకు 89 పాత భవనాలను కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.
146 భవనాలకు రిపేర్లు చేసుకోవాలని ఆదేశించారు. 331 ఇండ్లకు సంబంధించి త్వరలో చర్యలు తీసుకోనున్నారు. సెల్లార్ల తవ్వకాలు బంద్ చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. 167 చోట్ల సెల్లార్లు తవ్వుతున్నట్లు గుర్తించిన అధికారులు.. 102చోట్ల రిటైనింగ్ వాల్ నిర్మించేలా చర్యలు తీసుకున్నారు.