- ఐదు రోజుల్లో రూ. రెండు లక్షల జరిమానా వేసిన బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు : రోడ్లపై చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేస్తున్న వారికి జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారు. గత ఐదు రోజుల్లో 88 మందికి రూ. 2,17,000 ఫైన్లు వేశారు. రోడ్లపై చెత్త, కన్ స్ర్టక్షన్ అండ్ డిమాలిష్(సీ అండ్ డీ) వ్యర్థాలు వేస్తున్న వారికి సర్కిల్ స్థాయిలో మెడికల్ ఆఫీసర్లు, సాలివేస్ట్ మేనేజ్ మెంట్ డీఈఈలు ఈ జరిమానాలు వేస్తున్నారు. గత నెల26న కాప్రా సర్కిల్‌లో 25 మందికి రూ.26,500, చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో నలుగురికి రూ.8500, ఫలక్ నుమా సర్కిల్‌లో ఒకరికి రూ.500, రాజేంద్రనగర్ సర్కిల్‌లో ఒకరికి రూ.10 వేలు, గోషామహల్‌లో ఐదుగురికి రూ.11 వేలు, శేరిలింగంపల్లిలో నలుగురికి రూ.4 వేలు చందానగర్‌లో
ఇద్దరికి రూ. 2 వేలు, అల్వాల్‌లో ఒకరికి రూ. వెయ్యి, అంబర్ పేట్‌లో నలుగురికి రూ.53 వేలు, సికింద్రాబాద్‌లో 8 మందికి రూ.8 వేలు జరిమానాలు విధించారు. గత నెల 27న మూసాపేట్ సర్కిల్‌లో ఒకరికి రూ.10 వేలు ఫైన్ వేయగా, 28న చాంద్రాయణగుట్టలో 8 మందికి రూ.12 వేలు, చందానగర్‌లో ఒకరికి రూ. వెయ్యి ఫైన్వేశారు. 29న చంద్రాయణగుట్టలో 8 మందికి రూ.25 వేలు ఫైన్లు వేయగా, అదేరోజు అంబర్ పేట్‌లో 5 గురికి రూ.7వేలు ఫైన్ వేశారు. 30న అంబర్ పేట్‌లో ఐదుగురికి రూ.35 వేలు, ఈ నెల 1న అంబర్ పేట్ సర్కిల్‌లో ఐదుగురికి రూ.2500 జరిమానా వేశారు.