స్ట్రీట్​ వెండర్​పై బల్దియా అధికారుల వేధింపులు

స్ట్రీట్​ వెండర్​పై బల్దియా అధికారుల వేధింపులు
  • కమిషనర్​కు ఫిర్యాదు చేసేందుకు వస్తే అనుమతించిన సెక్యూరిటీ

హైదరాబాద్​, వెలుగు:  ఆఫీసర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అంబర్​పేట్​లోని డీడీ కాలనీకి చెందిన స్ట్రీట్​వెండర్ ​రేణుక బుధవారం బల్దియా హెడ్డాఫీసు వద్ద  ఆవేదన  వ్యక్తం చేసింది. కమిషనర్​కి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అనుమతివ్వకపోవడంతో  తిరిగి వెళ్లితూ  మీడియాతో మాట్లాడింది. డీడీ కాలనీలో అందరి మాదిరిగానే రోడ్డు పక్కన పూలు అమ్ముతానని, నెలకి  రూ.8 వేలు ఇవ్వాలని బల్దియా సిబ్బంది డిమాండ్ చేస్తున్నారని వాపోయింది. డబ్బులు ఇవ్వకపోవడంతో తన బండిని పెట్టనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వేరే వారిని ఏం అనకుండా కేవలం తనపై మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పింది. భర్తను కోల్పోయి పిల్లలతో ఉంటున్నానని, పనిచేయకపోతే ఇల్లు కూడా గడవదని పేర్కొంది. ఆఫీసర్లు ఇబ్బంది పెడుతుండడంతో రోడ్డున పడాల్సి వస్తుందని తెలిపింది.   వచ్చిన దాంట్లో వారికి ఇస్తే నాకేం మిగులుతుందని రేణుక కన్నీరు పెట్టుకుంది.