- కుందన్ బాగ్ వైట్ హౌస్ బిల్డింగ్
- ఓనర్ పై జీహెచ్ఎంసీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: రోడ్డుపై నీరు వదిలిన బిల్డింగ్ ఓనర్ కి జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే..శనివారం జీహెచ్ఎంసీ అధికారులు స్వచ్ఛత అమలులో భాగంగాపలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సోమాజిగూడలోని కుందన్ బాగ్ లోని వైట్ హౌస్ బిల్డింగ్ ముందు రోడ్డుపై నీరు వదిలినందుకు ఖైరతాబాద్ సర్కిల్ అధికారులు ఓనర్ కి రూ.25 వేలు ఫైన్ వేశారు. మరోవైపు సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్ సర్కిళ్లలోని మటన్, చికెన్ షాప్ ల్లో తనిఖీ చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది పలు దుకాణాలపై చర్యలు తీసుకున్నారు. ఓ దుకాణ యజమాని స్లాటర్ హౌజుల నుంచి తీసుకురాకుండా సొంతంగా మాంసం అమ్ముతున్నట్టు గుర్తించారు. ఆ దుకాణంలో స్వచ్ఛత కూడా పాటించకపోవడంతో రూ.7,200 జరిమానా విధించి 30కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు.