కూకట్పల్లి/గండిపేట, వెలుగు : కేపీహెచ్‌బీ కాలనీలోని ఫుట్ పాత్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం తొలగించారు. గోకుల్ప్లాట్స్చౌరస్తా నుంచి నెక్సస్మాల్చౌరస్తా వరకు, టెంపుల్ బస్టాప్ నుంచి బ్రాండ్ఫ్యాక్టరీ వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై వెలసిన షాపులు, డబ్బాలు, షెడ్లను తొలగించారు. అలాగే నార్సింగి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, అధికారులు సంయుక్తంగా మంగళవారం స్పెషల్డ్రైవ్చేపట్టారు.
ఫుట్ పాత్ పై వెలసిన అక్రమ నిర్మాణాలను, షాపులను తొలగించారు. రాయల్ ఫంక్షన్ హాల్ నుంచి గండిపేట చౌరస్తా వరకు ఉన్న అక్రమ షెడ్లను నేలమట్టం చేశారు. మరోసారి షెడ్లు నిర్మిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మున్సిపల్కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు.