హైదరాబాద్ : తరచూ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్ కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం నోటీసులు అందించింది. ఆసుపత్రులు, కమర్షియల్ కాంప్లెక్సులు, గోదాములు, సిలిండర్ స్టోర్స్, ఫార్మా, ప్లాస్టిక్, రబ్బర్ దుకాణాలకు నోటీసులు అందించారు. నగరంలోని మొత్తం 23 దుకాణాలు, మాల్స్ కు నోటీసులు జారీ చేశారు.
అమీర్ పేట్ లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్, సికింద్రాబాద్ షాపర్స్ స్టాప్, మినర్వా కాంప్లెక్స్ యజమాన్యానికి నోటీసులు అందించారు. చంద్రాయణగుట్ట రిలయన్స్ స్మార్ట్, కవాడిగూడలోని ఎన్టీపీసీ బిల్డింగ్, ఈసీఐఎల్ లోని తులసి హాస్పిటల్ కు నోటీసులు జారీ చేశారు. సెల్లార్ లో ఎమర్జెన్సీ దారులు తెరచి ఉంచాలని నోటీసులు అందించారు. మూడు రోజుల్లో అన్ని సరిచేసుకోకుంటే సీజ్ చేస్తామని హెచ్చరిచించారు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి.