సీజనల్ ఫ్రూట్స్ పేరుతో రసాయనాలు కలిపిన పండ్ల అమ్మకం

సీజనల్ ఫ్రూట్స్ పేరుతో రసాయనాలు కలిపిన పండ్ల అమ్మకం

సీజనల్ ఫ్రూట్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తూ  ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అమీషా ఫుడ్ కంపెనీని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్లోని  అమీషా ఫుడ్ మేకింగ్ కంపెనీపై  జీహెచ్ఎంసీ అధికారుల దాడులు చేశారు.  స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు..సీజనల్ ఫ్రూట్స్ పేరుతో ఐస్ క్రీమ్, ఇతర మీట్ ప్రాడక్ట్స్ తయారు చేస్తున్నట్లు గురించారు. 24 గంటల్లోనే కాయలు పండుగా మారడానికి ఉపయోగిస్తున్న ఇథనాల్, ఇతర కెమికల్స్ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోర్క్ మీట్, ఐస్ క్రీమ్స్, ఇతర ప్రాడక్టులను సీజ్ చేశారు. భారీ ఎత్తున ఇథనాల్, స్పిరిట్, కెమికల్స్ స్వాధీనం చేసుుకన్నారు. యాజమాన్యంపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. 

ఇథనాల్, ఇతర కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తున్న ఫ్రూట్స్, పోర్క్ మీట్, ఇతర ప్రాడక్టులను మన దేశంతో పాటు, శ్రీలంక, జాంబియా, ఆస్ట్రేలియా దేశాలకు సరఫరా చేస్తున్నారు.  ఇవి కుళ్లిపోకుండా ఉండేందుకు ఇథనాల్, ఇతర కెమికల్స్ వాడుతున్నారు.  లోకల్గా ఓ షెటర్లో తయారు చేసిన ఆన్ లైన్లో అమ్ముతున్నారు. వ్యాక్యూమ్ ప్యాక్ లు లేకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా తయారు  చేస్తున్నారు.  ఉత్తరప్రదేశ్కు  చెందిన అమీషా ఫుడ్స్ యజమాని నగరంలో ఈ  దందా నిర్వహిస్తున్నారు.