హైదరాబాద్‌లో కుక్కలకు ఫుడ్ పెట్టాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: జీహెచ్ఎంసీ

హైదరాబాద్, వెలుగు: వీధి కుక్కలకు ఫుడ్ అందించేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఫుడ్​పెట్టొద్దని, రిజిస్ట్రేషన్​చేసుకున్నవారికి ఒక లోకేషన్ కేటాయిస్తామని స్పష్టం చేశారు. వలంటీర్లతోపాటు సిటిజన్లు వీధి కుక్కలకు ఫుడ్​పెట్టాలనుకుంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. స్కూళ్లు, ప్లే గ్రౌండ్లు, జనవాసాలకు దూరంగా లోకేషన్స్ కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో కుక్కల స్వైరవిహారం, దాడులు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.