
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. హోటళ్లు,రస్టారెంట్లు..మటన్,చికెన్ షాపులపై మార్చి 21న ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. లేటెస్ట్ గా డబీర్ పుర మాతాకీ కిడికిలో తనిఖీలు నిర్వహించి... అక్రమంగా నిల్వ చేసిన మాంసాన్ని సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పాడైన మేక, గొర్రె మాంసం నిల్వ చేసి అమ్ముతున్న మహమ్మద్ మిస్బాహుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
జీహెచ్ఎంసీ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో హోటల్ పై దాడులు చేసిన అధికారులు.. 2 క్వింటాళ్ల పాడైన మాంసం రికవరీ చేశారు. పాడైపోయిన మేక, గొర్రెల తలకాయలు, కాళ్ళు, బోటీ, లివర్ లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి.. పెళ్ళిళ్ళు హోటల్స్ కి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. రెండ్రోజుల క్రితం గోషామహల్ లో 12 టన్నుల పాడైన మాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. పాడైపోయిన ఈ మాంసాన్ని స్టోర్ చేసి.. తక్కువ ధరకు బల్క్ గా అమ్ముతున్నట్లు దాడుల్లో గుర్తించారు అధికారులు ఎక్కువగా ఓల్డ్ సిటీ అడ్డాగా ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు చేస్తున్నారు.
ఇవాళ(మార్చి 21)న ఉదయం కొండాపూర్ లోని కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కిచెన్ అపరిశుభ్రవంగా ఉండటంతో పాటు డ్రైనేజీ వాటర్ పొంగుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. చెడిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ఇతర వస్తువుల వాడుతున్నట్లు గుర్తించారు. హోటల్ లో పని చేస్తున్న స్టాఫ్ కూడా కనీసం హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ కాప్స్ కూడా ధరించడం లేదని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా డిస్ ప్లే చేయలేదని చెప్పారు