GHMCలో మరోసారి ఫేక్ సర్టిఫికెట్ల కలకలం..ఉద్యోగి సస్పెండ్..60 మందిపై కేసు

హైదరాబాద్: GHMCలో మరోసారి ఫేక్ సర్టిఫికెట్ల కలకలం రేపుతున్నాయి. నకిలీబర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీలో నిర్లక్ష్యం వహించిన ఓ ఉద్యోగిపై వేటుపడింది. కొంతమందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నకిలీ సర్టిఫికెట్ల జారీ కి కారణమైన ఉద్యోగిని సస్పెండ్ చేశారు జీహచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్.. మరో 60 మందిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఓల్డ్ సిటీలోని ఓ మీ సేవా సెంటర్ నుంచి ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించారు. 

గతంలో 23 వేల ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ అయిన విషయంలో జీహెచ్ ఎంసీ ఆరోపణ ఎదుర్కొంది. తాజాగా ఓల్డ్ సిటీలో ఇన్ని ఫేక్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నా పట్టించుకోవడం లేదని చీఫ్ మెడికల్ ఆఫీషర్ పద్మజపై జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు.  ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జీహెచ్ ఎంసీ కమిషనర్.