రాష్ట్రంలో సమ్మెల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సెకండ్ ఏఎన్ఎంలు తమను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగగా..తాజాగా జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం సమ్మె సైరెన్ మోగించారు.
ఆగస్టు 18 నుంచి జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా సమ్మె బాట పడుతున్నట్లు ప్రకటించారు. తమను పర్మినెంట్ చేయాలన్న డిమాండ్తో సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. బల్దియా దక్కా..పర్మినెంట్ పక్కా నినాదంతో ఆగస్టు 18వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన చేపడతామన్నారు. ఆ తర్వాత సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు.