- లూ కేఫ్ 3.O పేరిట ఏర్పాటు చేయనున్న జీహెచ్ఎంసీ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌పరిధిలో మోడ్రన్టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్చేస్తోంది. టాయిలెట్ల నుంచి వెళ్లే వ్యర్థ జలాలను డ్రైనేజీ నాలాలో కలవక ముందే రీసైకిల్చేసేలా రూపొందిస్తోంది. ఆస్కి(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా), బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్సహకారంతో ‘లూకేఫ్3.O’ పేరుతో ఈ టాయిలెట్లను ఏర్పాటు చేస్తోంది. రీ ఇన్వెంటెడ్టాయిలెట్యూనిట్గా పిలిచే ఈ మోడ్రన్టాయిలెట్లు పూర్తిగా ఆటోమేటెడ్. చిన్నతరహా ఎస్టీపీ మాదిరిగా వ్యర్థ జలాలు అక్కడే రీసైకిల్అవుతాయి. వీటి పనితీరు, క్లీనింగ్‌ను లూకేఫ్సంస్థ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్చేయనుంది. ముందుగా రద్దీగా ప్రాంతాల్లో ఈ మోడ్రన్టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ ప్లాన్చేస్తోంది. అక్కడి ఫలితాలను బట్టి గ్రేటర్ అంతటా ఏర్పాటు చేయనుంది.