ఫోర్జరీ సంతకంతో రూ. 40 కోట్ల కాంట్రాక్ట్.. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో కంప్లైంట్

ఫోర్జరీ సంతకంతో రూ. 40 కోట్ల కాంట్రాక్ట్.. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో కంప్లైంట్

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 193 ఫిర్యాదులు అందాయి.   సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి,  డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి .  ఎక్కువగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు  ఫిర్యాదులు వచ్చాయి.  

ఫోర్జరీ లైసెన్సులతో SRC కన్ స్ట్రక్షన్  అనే సంస్థ జీహెచ్ఎంసీలో30 కోట్ల నుంచి 40 కోట్ల పనులు దక్కించుకుందని ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు.  ఈ సంస్థకు పలువురు జీహెచ్ఎంసీ అధికారులు సహకరించారని కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.  విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.  ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ ఇలంబరితి అధికారులను ఆదేశించారు.

ప్రజాసమస్యలపై ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత సోమవారం( ఫిబ్రవరి 24న) ప్రజావాణికి 194 ఫిర్యాదులు వచ్చాయి.