హైదరాబాద్లో 73 లోకేషన్లలో నిమజ్జనం

హైదరాబాద్ సిటీ : గణేశ్ ​విగ్రహాల నిమజ్జనానికి 73 ప్రాంతాల్లో వివిధ రకాల కొలనులను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్, 22 ఎస్కలేటర్ పాండ్స్ ఉన్నాయి. వీటిలో పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా 2 ఫీట్ల నుంచి 5 ఫీట్ల వరకు ఉన్న చిన్న విగ్రహాలు నిమజ్జనం చేస్తారు.