హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. అధికారులు 2 వేల కోట్లు కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఆ మేరకు కాలేదు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,640 కోట్లు రాబట్టారు. శుక్రవారం చివరి రోజు కావడంతో బల్దియా ఆఫీసుల్లోని సిటిజన్ సర్వీస్సెంటర్లను రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రాపర్టీ దారులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఒక్కరోజులో రూ.40 కోట్లకుపైగా ట్యాక్స్ వసూలైంది. 2019–20 సంవత్సరంలో రూ.1,357 కోట్లు, 2020–21లో రూ.1,633 కోట్లు, 2021–22 రూ.1,495 కోట్లు రాగా 2022–23లో రూ.1,640 కోట్లు వసూలవడం విశేషం.