‘హెచ్- సిటీ’ భూసేకరణ పూర్తవ్వాలి : జీహెచ్ఎంసీ అడిషనల్​ కమిషనర్ శివకుమార్​ నాయుడు

‘హెచ్- సిటీ’ భూసేకరణ పూర్తవ్వాలి : జీహెచ్ఎంసీ అడిషనల్​ కమిషనర్ శివకుమార్​ నాయుడు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హెచ్– సిటీలో భాగంగా రూ.7,032 కోట్లతో చేపట్టనున్న పనుల కోసం కావాల్సిన భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివ కుమార్ నాయుడు ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్ లోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న భూసేకరణను బుధవారం ఆయన పరిశీలించారు. పాటిగడ్డ ఆర్ఓబీ, రసూల్ పురా ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం, ఆర్ కే పురం, చిలకలగూడ రైల్ అండర్ బ్రిడ్జి పనులకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ఆయన వెంట ప్రాజెక్టు ఈఈ రోహిణి, టౌన్ ప్లానింగ్ అధికారులు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్   ఉన్నారు.