- సోషల్ మీడియాలో బల్దియా ప్రచారం
హైదరాబాద్, వెలుగు: విష జ్వరాలు పెరుగుతున్న నేపథ్యం లో ఇంట్లోకి దోమలు రాకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ ఎంసీ ప్రచారం నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందిం చిన పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్నారు. గదిలో నిమ్మకాయలు, లవంగాలు పెడితే దోమలు దూరంగా ఉంటాయని పోస్టర్‌లో పేర్కొన్నారు. కొబ్బరి, నీలం నూనె, కర్పూరం ఆకుల వంటివి గదిలో పెట్టుకుం టే కూడా సత్ఫలితా లు ఉంటాయని తెలిపారు