కూకట్పల్లి, వెలుగు: బాలానగర్ పీఎస్పరిధి గాంధీనగర్పారిశ్రామికవాడలోని డస్ట్‌బిన్‌లో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. జీహెచ్ఎంసీ శానిటేషన్కార్మికురాలు నీలమ్మ(50) డస్ట్‌బిన్‌లో నుంచి చెత్తను తీసి బండిలో వేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. నీలమ్మ కాలి వేళ్లు కట్అయ్యాయి.
తోటి కార్మికులు, స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీలమ్మ చెత్త ఎత్తుతున్న టైంలో ఓ ప్లాస్టిక్కవర్పై కాలు వేయగా, బ్లాస్ట్అయిందని పోలీసులు తెలిపారు. కెమికల్ఫ్యాక్టరీల నుంచి ఎవరైనా వేస్ట్తెచ్చి పోశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేశారు.