జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రొనాల్డ్‌ రాస్‌ 13 రోజుల సెలవులపై యూరప్ వెళ్తున్నారు. జూన్ 8 నుంచి (రేపటి) నుంచి జూన్ 23 వరకు వ్యక్తిగత కారణాల వల్ల యూరప్ వెళ్లనున్నారు. దీంతో 13 రోజులపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రొనాల్డ్ రస్ యూరప్ నుంచి తిరిగి వచ్చేంతవరకు  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆమె హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.